Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సింగరేణి ప్రైవేటీకరణపై మంత్రి కీలక ప్రకటన.. శ్రీధర్‌బాబు ఏమన్నారంటే?

Minister Sridhar Babu key announcement on Singareni privatization
Advertisement
  • సింగరేణిని ప్రైవేటీకరించబోమని శ్రీధర్‌బాబు స్పష్టీకరణ
  • ప్రైవేటీకరణపై విపక్షాల ఆరోపణల్లో నిజం లేదని వెల్లడి
  • గత బీఆర్ఎస్ పాలనపై మంత్రి తీవ్ర విమర్శలు
  • సింగరేణికి భారీగా బకాయిలు పెట్టారని ఆరోపణ
  • ఆధారాలు లేని విమర్శలను పట్టించుకోవద్దని కార్మికులకు సూచన
Advertisement
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సంస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. సింగరేణి భవిష్యత్తుపై కార్మికులు గానీ, ప్రజలు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాలనలో సింగరేణిని కేసీఆర్ కుటుంబం సొంత సంస్థలా మార్చుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సంస్థకు భారీగా బకాయిలు పెట్టి ఆర్థికంగా దెబ్బతీశారని విమర్శించారు. అప్పట్లో సంస్థను నిర్వీర్యం చేసిన నాయకులు, ఇప్పుడు కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

సింగరేణి సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఆధారాలు లేని విమర్శలను ప్రజలు, కార్మికులు పట్టించుకోవద్దని సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే సింగరేణిని కాపాడిందని, ఇప్పుడు కూడా సంస్థ ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పూర్తి స్థాయిలో నడిపిస్తామని ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 
Advertisement
Advertisement
Sridhar Babu
Singareni privatization
Singareni Collieries Company Limited
Telangana Government
BRS Party
Yadadri Thermal Power Plant

More Telugu News